• Home »
  • Cinema »
  • నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్టులుక్

నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్టులుక్

‘ఒక మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి సినిమాగా ‘సూర్యకాంతం’ రూపొందుతోంది. రాహుల్ విజయ్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది.

నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నాయకా నాయికల ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. కథానాయకుడిని ఆరాధనా పూర్వకంగా చూస్తూ .. ఆ తరువాత ఆయనని టార్చర్ పెడుతూ ఈ పోస్టర్లో నిహారిక కనిపిస్తోంది. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. ఆసక్తికరమైన టైటిల్ తో .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న నిహారికకి ఈ సారైనా హిట్ పడుతుందేమో చూడాలి.