• Home »
  • Cinema »
  • ‘ఎఫ్ 2’ టీజర్ పై స్పందించిన మహేశ్ బాబు

‘ఎఫ్ 2’ టీజర్ పై స్పందించిన మహేశ్ బాబు

వెంకటేశ్ గారి కామెడీ బాగుంది
టీమ్ కి ఆల్ ది బెస్ట్
వెంకటేశ్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’ సినిమా నుంచి నిన్న టీజర్ ను వదిలారు. పూర్తి వినోదభరితమైన కంటెంట్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరిని కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ హాయిగా నవ్వుకునేలా చేసింది. తాజాగా ఈ టీజర్ పై హీరో మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

“ఈ సినిమా టీజర్ నేను చూశాను. ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ చాలా బాగున్నాయి. భయపడుతున్నట్టుగా వెంకీ చేసిన కామెడీ బాగుంది” అంటూ ఆయన ఈ సినిమా టీమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేశాడు. ఇక ఈ రోజున వెంకటేశ్ పుట్టినరోజు కావడం వలన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేశ్ బాబు నుంచే ప్రశంసలు వచ్చాయంటే, తొలి టీజర్ తోనే అంచనాలు పెంచేయాలనే అనిల్ రావిపూడి ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా సందడి చేసిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
Tags: F2 movie release date, venky, mahesh babu,varun tej