• Home »
  • Cinema »
  • సూర్యతో డ్యాన్స్ చేస్తున్న రకుల్

సూర్యతో డ్యాన్స్ చేస్తున్న రకుల్

‘చిత్రలహరి’ షూటింగులో సాయిధరం తేజ్
’96’ అక్కడ ’99’గా మారింది!
* సూర్య హీరోగా నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. కొచ్చిలో చిత్రీకరిస్తున్న ఈ పాటలో సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంటున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి కూడా నటిస్తోంది.
* గత కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో వున్న సాయిధరం తేజ్ తాజాగా ‘చిత్రలహరి’ చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
* తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ’96’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మరోపక్క ఈ చిత్రాన్ని కన్నడలో కూడా రీమేక్ చేస్తున్నారు. అయితే, అక్కడ దాని టైటిల్ని ’99’గా మార్చారు.
Tags: surya next movie, rakulprteet singh, tollywood updates