Articles Posted in the " Health " Category

 • జైపూర్‌లో జికా వైరస్

  రాజస్థాన్‌లోని జైపూర్‌లో జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఏడుగురు జికా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ఈ ఘటన పట్ల ప్రధాన మంత్రి కార్యాలయం అప్రమత్తత ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఓ బృందం జైపూర్‌కు వెళ్లనున్నది. సెప్టెంబర్ 24వ తేదీన ఓ వ్యక్తి జికా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. ఆ తర్వాత సుమారు 22 శ్యాంపిళ్లను పుణెలోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. […]


 • దేశవ్యాప్తంగా రేపు మెడికల్ షాపుల బంద్

  ఆన్ లైన్ లో మందులు అమ్మకంపై నిరసన ఏఐఓసీడీ పిలుపు మేరకు బంద్ మద్దతిచ్చిన ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ దేశ వ్యాప్తంగా రేపు మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ లో మందులు అమ్మకం, ఈ-ఫార్మసీ విధానాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు రేపు మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఈ బంద్ కు ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ […]


 • కాఫీ కావాలా.? కాస్త జాగ్రత్త !

  ఒకప్పుడు ఇరానీ చాయ్‌కి కేరాఫ్‌గా ఉన్న సిటీలో ఇప్పుడు కాఫీ ఘుమఘుమలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. కాఫీ డేలు, కాఫీషాప్‌లు అనధికార ఆఫీసులుగా, వినోద కేంద్రాలుగా మారిపోతూ గంటల తరబడి కాలక్షేపాలకు వేదికలవుతున్నాయి. సిటీలో కాఫీ ప్రియత్వం ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగుచూసిన ఓ పరిశోధన కాఫీ ప్రియులైన యువతులకు పలు హెచ్చరికలు చేస్తోంది. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ రీ ప్రొడక్షన్‌ ప్రకారం… జాతీయస్థాయిలో 14శాతం మంది (దాదాపు 2.71 […]


 • సారిడాన్ ట్యాబ్లెట్ పై నిషేధం ఎత్తివేత!

  గత వారం 328 కాంబినేషన్ డ్రగ్స్ ను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అసురక్షిత మాత్రల జాబితా కింద కేంద్ర ఆరోగ్య శాఖ ఈ 328 మందుల అమ్మకాలు, ఉత్పత్తిపై నిషేధం విధించింది. వీటిలో పెయిన్ కిల్లర్ సారిడాన్ కూడా ఉంది. అయితే, ఆ జాబితాలో ఉన్న సారిడాన్ తో పాటు మరో రెండు మాత్రలపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. సారిడాన్ ను మార్కెట్లో అమ్ముకోవచ్చంటూ ఈరోజు తీర్పును వెలువరించింది. మన దేశంలో తలనొప్పికి సారిడాన్ ట్యాబ్లెట్ […]


 • పెద్దపేగు ఇన్ఫెక్షన్‌కు మలంతో చికిత్స.. త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి

  పెద్ద పేగుకు మలంతో చికిత్స ఫీకల్ ట్రాన్స్‌ప్లాంటేన్ పేరుతో ఇప్పటికే అందుబాటులోకి అద్భుత ఫలితాలు ఉంటాయన్న వైద్యులు వివిధ రకాల యాంటీ బయాటిక్స్ ఆవిష్కరణతో వైద్యులు పలు వ్యాధులకు చెక్ పెట్టగలుగుతున్నారు. అయితే, ప్రతి చిన్న వ్యాధికీ యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇది మరిన్ని కొత్త జబ్బులకు, పేగుల్లో ఇన్ఫెక్షన్లకు కారణం అవుతోంది. పెద్దపేగుల్లో వచ్చే ఇటువంటి ఇన్ఫెక్షన్లకు ఇప్పుడు సరికొత్త వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ వైద్యం గురించి చెబితే కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చేమో కానీ, […]


 • బండి తిండి.. ఆరోగ్యానికి గండి

  నగరవాసుల ఆహార అలవాట్లు మారుతున్నాయి.. ‘బండి తిండి’కి అలవాటు పడాల్సి వస్తోంది. పని ఒత్తిడి.. గంటలతరబడి ప్రయాణం.. ఇలా కారణాలు ఏవైనా కడుపు నింపుకొనేందుకు.. రోడ్డు పక్కన తోపుడు బండ్లపై దొరికే ఆహారమ్మీద ఆధార పడుతున్నారు. నగరంలోనూ ఈ తరహా చిరు వ్యాపారులు పెరిగిపోయారు. కొందరైతే మధ్యాహ్నం భోజనాన్నీ అందిస్తున్నారు. ఈ తిండి ఆరోగ్యకరం కాదని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) హెచ్చరిస్తోంది. రహదారుల పక్కన లభించే ఆహారపదార్థాలు ఎంతవరకు ఆరోగ్యకరమనే అంశాన్ని ఎన్‌ఐఎన్‌ గతంలో పరీక్షించింది. […]


 • వర్షాకాలంలో నిమ్మకాయ.. తింటే మంచిదేనా?

  ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చూస్తే పచ్చన.. కోస్తే తెల్లన.. తింటే పుల్లన’ అంటే ఏది అనడిగితే చటుక్కున గుర్తుకొచ్చేది నిమ్మకాయ. తెలుగు లోగిళ్లలో నిమ్మకాయ పచ్చడి లేని వంటగది ఉండదంటే అతిశయోక్తి కాదు. మరి ఇంతలా మనకు తెలిసిన నిమ్మకాయపై ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయి. వాటిల్లో, వర్షాకాలంలో నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందన్నది ముఖ్యమైంది. ఇది నిజమేనా.. నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందా? దానిలోని ఇమ్యునిటీ సంగతేంటి? అసలెందుకీ అపోహలంటే.. పుట్టుకపై స్పష్టత లేదు: మనకు బాగా పరిచయమైన నిమ్మ […]


 • ‘నీట్’గా మాయాజాలం.. సున్నా మార్కులు వచ్చినా డాక్టర్ అయిపోవచ్చు!

  నీట్ ప్రవేశ పరీక్షలో లేని కటాఫ్ మార్కులు మార్కులతో సంబంధం లేకుండా.. డబ్బుంటే డాక్టర్ అయిపోవచ్చు సంచలన విషయాలను వెల్లడించిన రిపోర్ట్ వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష డొల్లతనం క్రమంగా బయటకు వస్తోంది. 2017లో నిర్వహించిన నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కేవలం సింగిల్ డిజిట్ మార్కులు తెచ్చుకున్న దాదాపు 400 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీటును సాధించారు. ఇంకా దారుణం ఏమిటంటే… సున్నా మార్కులు లేదా నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న 110 […]


 • కబళిస్తున్న జీవనశైలి

  తెలుగు రాష్ట్రాల్లో జీవనశైలి వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్‌ తదితర వ్యాధులు క్రమేణా కబళిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న అసాంక్రమిక వ్యాధుల చికిత్స క్లినిక్‌లకు వచ్చే వారిలో అత్యధికులు మధుమేహులే కావడం ఆందోళన కలిగించే అంశమే. ఈ క్లినిక్‌లలో చికిత్స పొందిన మొత్తం రోగుల్లో ఏపీలో 27.56 శాతం మంది, తెలంగాణలో 9.23 శాతం మంది మధుమేహులున్నారు. అలాగే ఏపీలో 27.46 శాతం, తెలంగాణలో 6.54 శాతం మంది అధిక […]


 • నేడు యోగా దినోత్సవం

  -దేశ, విదేశాల్లో ఏర్పాట్లు చేసిన ఆయుష్ మంత్రిత్వశాఖ -యోగాను రాజకీయ పనిముట్టుగా వాడుకోవద్దంటున్న ముస్లిం సంఘాలు న్యూఢిల్లీ: నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురువారం జరుపుకొనేందుకు సర్వం సిద్ధమైంది. దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాల్లో కూడా యోగా దినోత్సవాన్ని మూడేండ్లుగా జూన్ 21న నిర్వహిస్తున్నారు. ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజుగా ప్రాధాన్యం ఉండటంతో ఈ రోజునే అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకోవాలని ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ప్రతిపాదించారు. ఈ […]