Articles Posted in the " Political News " Category

  • మోడీ, షాలకు అగ్ని పరీక్షే

    వచ్చే లోక్ సభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమైనవో… ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకూ అంతే ముఖ్యమైనవి. ఈ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడపకపోతే సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వెల్లువత్తే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే కొందరు ఎంపీలు, బీజేపీ నేతలు ఈ ఇద్దరిపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషిలను పక్కన పెట్టారన్న ఆగ్రహం పార్టీ శ్రేణులు లోలోపల […]


  • అనంత‌పురం టీడీపీలో ఆ ఐదుగురికి కష్టమే..

    అనంత‌పురంలో పార్టీ ప‌రిస్థితి దిగజారిందా? అక్క‌డ నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న విధంగా ఉన్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ మ‌రింత ఇబ్బందుల్లో కూరుకుపోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతోందా? అంటే.. ఔన‌నే సందేహాలే వ‌స్తున్నాయి. అనంత‌పురం టీడీపీకి అస‌లు సిస‌లైన కంచుకోట‌. నిజానికి పార్టీ అధినేత, సీఎం చంద్ర బాబు సొంత జిల్లా చిత్తూరు క‌న్నాఎక్కువ‌గా అనంతపురం ప్ర‌జ‌లు పార్టీని ఆద‌రిస్తున్నారు. ఇక్క‌డ గ‌త 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం ఉర‌వ‌కొండ‌, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాలు త‌ప్పితే.. […]


  • పైసలిస్తే లంచానికే లైసెన్స్

    ద్విచక్ర, భారీ వాహనాలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. కానీ పైసలిస్తే ఎలాంటి టెస్ట్‌ లేకుండానే లైసెన్సులు వచ్చేస్తున్నాయి. ఈ దందాకు అనధికార ఏజెంట్లతోపాటు కొంతమంది మీడియా సిబ్బంది, హోంగార్డులు, రవాణా అధికారుల డ్రైవర్లు రవాణా కార్యాలయం వద్ద కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఎంవీఐ 113 లైసెన్స్‌లకు వేలిముద్ర వేయించి ఓకే చేశారు. అయితే ఈ విషయంపై ఓ అజ్ఞాత వ్యక్తి డీటీసీకి ఫోన్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా […]


  • ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కొత్త నినాదం..

    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పాత్తు ఉంటుందీ? లేనిదీ ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సాధన నినాదంతోనే ఎన్నికలకు వెళ్లాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంతో పొత్తు ఉంటుందా? లేదా? అన్నది ఇంకా తెలియలేదు. దానికి ఇంకా సమయం పడుతుంది. ఎన్నికలకు ముందు పొత్తు కుదిరే అవకాశాలున్నాయి. కుదరకపోయే ఛాన్సు కూడా ఉంది. అందుకోసమే సొంతంగా బలపడాలని ఆ […]


  • నేతలే లాజిక్కే వేరప్పా…గెలిస్తే..తమ గొప్ప..ఓడితే..ఈవీఎంలపై కామెంట్

    గెలిస్తే ఆ గొప్ప మాదే అంటారు. ఓడితే తప్పంతా ఈవీఎం పాపం అంటున్నారు. దేశంలో రాజకీయ పార్టీల నయా ట్రెండ్ ఇదే మరి. బిజెపి గెలిచిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇదే ఆరోపణ చేస్తూ వచ్చేది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసి తెలంగాణ లో చతికిల పడినపుడు ఇదే చెప్పింది. అయితే గెలిచిన రాష్ట్రాల్లో మాత్రం ఈ ముక్క చెప్పడం లేదు. కాంగ్రెస్ గోల అలా పక్కన పెడితే ఇప్పుడు ఇదే జపాన్ని అందుకున్నారు […]


  • ఇక టీడీపీ జాతీయ ఆశలు గల్లంతు… తెలంగాణలో పడిపోయిన ఓటింగ్

    జాతీయ పార్టీగా అవతరించాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఇటీవలి తెలంగాణ ఎన్నికలు భారీ షాక్ నే ఇచ్చాయి. 13 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 2 స్థానాలు మాత్రమే విజయం సాధించింది. ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, సత్తుపల్లి మినహా ఎక్కడా టీడీపీ గెలవలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయడు ప్రచారం చేసిన స్థానాల్లోనూ టీడీపీ ఓటమి పాలయ్యింది. […]


  • ఏపీలోనూ..ముందస్తు అభ్యర్థుల ఖరారు

    తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్.. ఊహించని రీతిలో ముందస్తు ఎన్నికలకు తరలేపి విజయకేతనం ఎగురవేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. తనకు సాటిలేదని నిరూపించారు. అయితే ఏపీ లో చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే. ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి పనుల పట్ల ఆనందంగా ఉన్నారు ఏపీ ప్రజలు. దీంతో బాబు కూడా కేసీఆర్ వలె ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో బాబు మాట్లాడిన తీరు […]


  • ఏపీలోనూ…కేసీఆర్ ఫార్ములా

    రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. ఢిల్లీ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఫిబ్రవరి 25న, అటు లోక్‌సభ కు, ఇటు, ఏపీ శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉందనే సమాచారం వస్తుంది. మన రాష్ట్రంలో చివరి విడతలో ఏప్రిల్‌లో పోలింగ్‌ ఉండవచ్చనే చర్చ జరుగుతుంది. ఇవన్నీ బేరీజు వేసుకున్న చంద్రబాబు అభ్యర్థులను ముందే ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రతి సారి, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత టీడీపీ అభ్యర్ధిని ప్రకటించే […]


  • బెజవాడలో వైసీపీ అభ్యర్థులపై దృష్టి

    ఎన్నికలకు మరో నాలుగు నెలలే ఉండటంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ అభ్యర్థులపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ లోక్ సభకు గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున కోనేరు రాజేంద్ర ప్రసాద్, టీడీపీ తరుపున కేశినేని నాని పోటీ చేశారు. అయితే కేశినేని విజయం సాధించారు. దీంతో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కోనేరు రాజేంద్రప్రసాద్ దాదాపు రాజకీయాల్లో నుంచి తప్పుకున్నట్లే. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చిన కోనేరు రాజేంద్ర […]


  • తెలంగాణలో పెధాయ్ ప్రభావం

    పెథాయ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను వణికించింది. ఈదురుగాలులకు ప్రజలు అల్లాడిపోయారు. ఏపీని వణికించిన చలిగాలులు తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రభావం చూపాయి. హైదరాబాద్‌లోనూ బలమైన చలిగాలులు వీచాయి. దీంతో ప్రజలు ఆరుబయటకు రావడానికే భయపడ్డారు. రాకాసి తుఫాన్ పెథాయ్ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్లలో, కల్లాలలో ఉంచిన ధాన్యం తడిసిముద్దైంది. దీంతో రైతులు కంటతడి పెట్టారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో […]