Articles Posted in the " Interviews " Category

 • తెలుగింటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది!

  రాశీ ఖన్నా అంటే అందమే కాదు.. చక్కటి అభినయం కూడా! ఆ విషయాన్ని ఆమె ‘ఊహలు గుసగుసలాడే’తోనే చాటి చెప్పింది. ఆ తర్వాత ఆ స్థాయిలో సత్తా చాటే అవకాశం ‘తొలిప్రేమ’తో ఆమెకు దక్కింది. ప్రస్తుతం నితిన్‌తో ‘శ్రీనివాసకళ్యాణం’లో నటించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా సోమవారం హైదరా బాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ… సినిమాలో మిమ్మల్ని మీరు చూసుకొన్నాక ఏమనిపించింది? కథ వినేటప్పుడే ఓ మంచి సినిమా […]


 • నాలుగున్నరేళ్ల తరువాత నిరుద్యోగ భృతా? ఎన్నికల కోసమేగా?

  చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రకటిస్తే బాగుండేది ఇప్పుడు ఎన్నికల స్టంటన్న అభిప్రాయం ఏర్పడుతోంది ఏదేమైనా భృతి ఇవ్వడం స్వాగతించదగ్గ పరిణామం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తే ఖజానాపై భారం తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై యువతీ యువకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన నాలుగున్నరేళ్లకు ఈ పథకానికి విధివిధానాలు ప్రకటించడం ఏంటని యువత ప్రశ్నిస్తోంది. పలువురు ఇంతకాలానికైనా ఓ ప్రధాన హామీని నెరవేర్చే దిశగా చంద్రబాబు సర్కారు […]


 • ఉన్నతవిద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

  ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పులేమి లేవు. ఇదివరకు ఉన్న విధంగానే పరీక్ష నిర్వహణ జరగనుంది. పరీక్ష ఫీజులో సైతం మార్పులేమి లేవు. క్రితంసారి ఉన్న విధంగానే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పోటీ పరీక్షలను ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు పర్యాయాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జేఈఈ(మెయిన్), నీట్(యూజీ)లను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించనున్నారు. ఈ సదవకాశం విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండనుంది. […]


 • ప్రభుత్వ ఉద్యోగాలు

  డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1572 పోస్టులు సంస్థ: డెడికేటెడ్‌ ఫ్రెయిట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (డీఎఫ్‌సీసీఐఎల్‌), న్యూదిల్లీ. మొత్తం ఖాళీలు: 1572 పోస్టులవారీ విభజన: ఎగ్జిక్యూటివ్‌-327, టెక్నీషియన్‌-349, ఎంటీఎస్‌-896. అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, సైకో టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా. పరీక్ష తేది: అక్టోబరు 1 నుంచి 5 దరఖాస్తు: ఆన్‌లైన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు: 01.08.2018 నుంచి 31.08.2018 వరకు. […]


 • ఉద్యోగ వంచన

  వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ యువతను కొన్ని ముఠాలు నిలువునా ముంచేస్తున్నాయి. తియ్యని మాటలతో వలేసి….నువ్వు ప్రభుత్వోద్యోగివి అయిపోయినట్టేనని అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. త్వరలో నువ్వు పనిచేయబోయేది ఈ కార్యాలయంలోనేనంటూ ఎన్నెన్నో ఆశలు కల్పిస్తున్నాయి. మేం చెప్పినంత డబ్బిస్తే…ఉద్యోగం నీకేనంటూ ఊరిస్తాయి. ఆ ఉచ్చులో చిక్కుకుని సొమ్ములు చెల్లించారో..ఆ మరుక్షణం నుంచే ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసేసి…నెంబర్లు మార్చేసి పరారవుతారు. ఈ తరహా నేరాల బారిన పడి తాము మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య […]


 • ఆరడుగులు ఉండాల్సిందే!

  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌… దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించి, ఇప్పుడు ఉత్తరాదిలోనూ మంచి అవకాశాలు కొట్టేస్తోంది. మరోవైపు వ్యాపారంలోనూ రాణిస్తోంది. ఈ బిజీ భామ తన ఇష్టాలూ, కెరీర్‌, ఫిట్‌నెస్‌ల గురించి చెబుతోందిలా..! ఏం తింటానంటే! ఉదయం వర్కవుట్‌కి ముందు బుల్లెట్‌ కాఫీ(ఒక స్పూన్‌ నెయ్యి కలిపిన కాఫీ) తాగుతా. వర్కవుట్‌ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్‌ లేదంటే ప్రొటీన్‌ పాన్‌కేక్‌లు తింటాను. కాకుంటే రాగి లేదా జొన్న రొట్టెలూ, ఉడకబెట్టిన గుడ్లూ తింటాను. షూటింగ్‌లో ఉంటే […]


 • సమంత సలహాలు తీసుకుంటున్నా!

  యువ కథానాయకులు నిర్మాణంవైపు దృష్టిసారిస్తున్నారు. నాగచైతన్య చేతిలో ఎలాగూ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఉంది. కాబట్టి తనకు ఈ సౌలభ్యాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకే ‘చి.ల.సౌ’ అనే చిత్రంలో భాగస్వామిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. సుశాంత్‌ కథానాయకుడిగా నటించారు. మరో కథానాయకుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన ‘చి.ల.సౌ’ సంగతులు. ఈ సినిమాపై ఎందుకంత ప్రేమ పుట్టింది? సుశాంత్‌ […]


 • అదితిరావ్ హైదరి – సుధీర్ బాబుతో వర్క్ చేయడం చాలా సులభం

  బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరి తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.. ఈ సినిమా అవకాశం మీకెలా వచ్చింది ? నేను వరుస సినిమాల్లో బిజీగా ఉండగా ఒకరోజు మోహన్ కృష్ణ ఇంద్రగంటిగారి నుండి కాల్ వచ్చింది. ఆయన ఐదు నిముషాల స్టోరీ లైన్ చెప్పారు. నేను పూర్తి నరేషన్ అడిగాను. ఆయన చెప్పారు. విన్న వెంటనే […]


 • నటుడు అనే ప్రతి ఒక్కరు ఇంద్రగంటిగారితో ఒక సినిమా చేసి తీరాలి!-సుధీర్ బాబు

  హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘సమ్మోహనం’. ఈ నెల 15వ తేదీన చిత్రం విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.. ఇంద్రగంటిగారిని మీరెప్పుడు కలిశారు ? మా పరిచయం ఇప్పటిది కాదు. నా మొదటి సినిమా ‘ఎస్.ఎమ్.ఎస్’ తర్వాత ఆయన నన్ను కకలిసి ఒక కథ చెప్పారు. నిర్మాణ సంస్థతో సైన్ కూడ చేసుకున్నాం. కానీ అది ఆగిపోయింది. అదే ‘ఊహలు గుసగుసలాడే’. ఆ కథ శ్రీనివాస్ అవసరాలది. […]


 • మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి – పరిశ్రమలోని మంచి, చెడు రెండిటినీ చెప్పడం జరిగింది !

  దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘సమ్మోహనం’. ఈ నెల 15వ తేదీన సినిమా విడుదలకానుంది. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం. ‘సమ్మోహనం’ సినిమా ఎలా వచ్చింది ? చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. నాకు పెద్దగా అసంతృప్తి లేని సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఈ సినిమా కథేమిటి ? సినిమాలంటే ఒక చిన్న చూపు ఉన్న అబ్బాయి […]