Articles Posted in the " News Bites " Category

 • ఉద్యోగ వంచన

  వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ యువతను కొన్ని ముఠాలు నిలువునా ముంచేస్తున్నాయి. తియ్యని మాటలతో వలేసి….నువ్వు ప్రభుత్వోద్యోగివి అయిపోయినట్టేనని అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. త్వరలో నువ్వు పనిచేయబోయేది ఈ కార్యాలయంలోనేనంటూ ఎన్నెన్నో ఆశలు కల్పిస్తున్నాయి. మేం చెప్పినంత డబ్బిస్తే…ఉద్యోగం నీకేనంటూ ఊరిస్తాయి. ఆ ఉచ్చులో చిక్కుకుని సొమ్ములు చెల్లించారో..ఆ మరుక్షణం నుంచే ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసేసి…నెంబర్లు మార్చేసి పరారవుతారు. ఈ తరహా నేరాల బారిన పడి తాము మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య […]


 • టాప్‌ 10 న్యూస్‌ – 9AM

  1. పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో 114 స్థానాల్లో ఆధిక్యంతో ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ ముందంజలో ఉంది. 64 స్థానాల్లో నవాజ్‌ షరీఫ్‌ పార్టీ పీఎంఎల్‌-ఎన్‌, 42 స్థానాల్లో పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి. 50 స్థానాల్లో స్వత్రంత్రులు సహా ఇతరులు ముందంజలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో పూర్తి ఫలితాలు వెలుబడనున్నాయి. 2. దక్షిణాఫ్రికాలోని జోహన్నస్‌ బర్గ్‌లో బ్రిక్‌ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. […]


 • ఇమ్రానే కెప్టెన్‌!

  పాక్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో పీటీఐ ముందంజ 59 స్థానాల్లో నవాజ్‌షరీఫ్‌ పార్టీ 34 స్థానాల్లో పీపీపీ హింసాత్మక సంఘటనల మధ్య ముగిసిన ఓటింగ్‌ ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతి పాకిస్థాన్‌లో ప్రజలు మార్పు కోరుకున్నారు. దేశ 70 ఏళ్ల చరిత్రలో ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న రెండో అధికార బదిలీ ప్రక్రియలో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ)వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపారు. బుధవారం జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో […]


 • ఆకాశంలో అద్భుతం రేపు

  అరుదైన అరుణవర్ణ సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఈ అద్భుత దృశ్యం అనుభూతిని రెట్టింపు చేసేందుకు అరుణ గ్రహమూ జోడీ కడుతోంది. అంటే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం, అరుణవర్ణ చంద్రుడు(బ్లడ్‌ మూన్‌)లతోపాటు అంగారక దర్శనానికీ శుక్రవారంనాటి ఆకాశం వేదికకానుంది. 15ఏళ్ల తర్వాత భూమికి చేరువగా ఆ రోజు అంగారకుడు రాబోతున్నాడని ఖగోళ నిపుణులు తెలిపారు. 5.77 కోట్ల కి.మీ. దూరంలో పెద్దగా అరుణ వర్ణంలో ఈ గ్రహం కనిపిస్తుందని చెప్పారు. ‘‘ఇది చాలా అరుదైన, […]


 • వర్షాకాలంలో నిమ్మకాయ.. తింటే మంచిదేనా?

  ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చూస్తే పచ్చన.. కోస్తే తెల్లన.. తింటే పుల్లన’ అంటే ఏది అనడిగితే చటుక్కున గుర్తుకొచ్చేది నిమ్మకాయ. తెలుగు లోగిళ్లలో నిమ్మకాయ పచ్చడి లేని వంటగది ఉండదంటే అతిశయోక్తి కాదు. మరి ఇంతలా మనకు తెలిసిన నిమ్మకాయపై ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయి. వాటిల్లో, వర్షాకాలంలో నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందన్నది ముఖ్యమైంది. ఇది నిజమేనా.. నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందా? దానిలోని ఇమ్యునిటీ సంగతేంటి? అసలెందుకీ అపోహలంటే.. పుట్టుకపై స్పష్టత లేదు: మనకు బాగా పరిచయమైన నిమ్మ […]


 • క్రికెటర్లకు షాకిచ్చిన బీసీసీఐ!

  ఓటమికి భార్యలే కారణమంటూ విమర్శలు భార్యలు, ప్రియురాళ్లను పక్కనబెట్టండి ఆటగాళ్లకు బీసీసీఐ ఆదేశం ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే ముందు ఆటగాళ్లకు పెను షాకిచ్చింది బీసీసీఐ. ఈ పర్యటనలో క్రికెటర్లు తమ భార్యలు లేదా ప్రియురాళ్లకు కనీసం నెల రోజుల పాటు దూరంగా ఉండాలని షరతు విధించింది. మైదానంలో ఆటగాళ్లు వైఫల్యం చెందడానికి చాలా సందర్భాల్లో వారి కుటుంబీకులే కారణమని విమర్శలు వస్తున్నాయి. టూర్లలో ఎంజాయ్ చేసి వచ్చి బ్యాటు పట్టుకుంటున్నారని, సరైన ప్రాక్టీస్ లేకుండా […]


 • తాజ్ మహల్ ను దత్తతకిస్తాం: యూపీ సర్కారు

  ఈ ప్రాంతాన్ని ’నో ప్లాస్టిక్ జోన్‘ గా ప్రకటిస్తాం సుప్రీంలో దార్శనిక పత్రాన్ని దాఖలు చేసిన యూపీ ప్రభుత్వం 40 చారిత్రక కట్టడాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను పరిరక్షించేందుకు కేంద్రం ఇటీవల ప్రారంభించిన దత్తత కార్యక్రమం కింద ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలకు దాన్ని దత్తత ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే తాజ్ తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని ’నో ప్లాస్టిక్ జోన్‘గా ప్రటిస్తామని […]


 • ఖగోళ అద్భుతం.. ఎక్కడెక్కడ వీక్షించవచ్చంటే!

  దిల్లీ : ఈ శతాబ్దపు సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఈ నెల 27న ఏర్పడనున్న విషయం తెలిసిందే. దాదాపు గంట 45 నిమిషాల పాటు సాగే ఈ చంద్రగ్రహణం చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే రోజు అరుణవర్ణ చంద్రుడు కూడా కనువిందు చేయనున్నాడు. ఉత్తర అమెరికా, అర్కిటిక్‌, పసిఫిక్‌ ప్రాంతాలు మినహా ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించవచ్చు. ఆయా దేశాల కాలమానాల ప్రకారం ఈ చంద్రగ్రహణం ఆయా సమయాల్లో కనిపించనుంది. కైరో(ఉత్తర ఆఫ్రికా)లో […]


 • వెంకయ్యకు క్షమాపణలు చెప్పిన విజయసాయిరెడ్డి

  దిల్లీ: ఏపీ విభజన చట్టంపై నిన్న రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు సభాముఖంగా క్షమాపణలు చెప్పారు. ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో సమయం అయిపోయిందంటూ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయన్ని నిలువరించారు. దీంతో విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. […]


 • భారత్ కు తిరిగివచ్చే ప్రయత్నాలలో మాల్యా.. అధికారులతో చర్చలు?

  ఈడీ అధికారులతో చర్చలు కేసుల ఎత్తివేతపై ఎలాంటి హామీ ఇవ్వని అధికారులు భారత్ కు రావాలనుకుంటే ఏర్పాట్లు చేస్తామని వెల్లడి బ్రిటన్ కోర్టులో త్వరలో ముగియనున్న విచారణ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా స్వచ్ఛందంగా భారత్ కు తిరిగి రావాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం మాల్యా ఇప్పటికే భారత అధికారులతో చర్చలు ప్రారంభించినట్లు వెల్లడించాయి. తాను భారత్ కు స్వచ్ఛందంగా తిరిగివస్తానని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులను మాల్యా ఆశ్రయించినప్పటికీ, […]