Articles Posted in the " News Bites " Category

 • ఎస్‌బీఐ కూడా ప్రకటించేసింది.. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!

  దసరా, దీపావళిని పురస్కరించుకుని భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్‌బీఐ) భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆ సంస్థ తీసుకొచ్చిన యోనో యాప్ ద్వారా ఈ పండుగ సీజన్‌లో కొనుగోళ్లు జరిపే వారికి భారీ రాయితీలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. డిజిటల్ షాపింగ్ వేదికను అందిస్తున్న ఏకైక బ్యాంకు తమదేనని పేర్కొన్న ఎస్‌బీఐ ఈ నెల 16 నుంచి 21 మధ్య ‘యోనో’ ద్వారా జరిపే కొనుగోళ్లపై పది శాతం రాయితీ, క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. దాదాపు 85 శాతం […]


 • ‘జీరో బ్యాలెన్స్’ సదుపాయం.. కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఖాతాల వెల్లువ!

  811 పొదుపు ఖాతా వల్లే పెరిగిన బ్యాంక్ ఖాతాలు ఎలాంటి చార్జీలు,కనీస నిల్వ కూడా లేకున్నా బ్యాంకింగ్ సేవలు 1.45 కోట్ల కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలందిస్తున్న కోటక్ మహింద్రా బ్యాంక్ కస్టమర్లకు ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ సేవలు భారం అయిన నేపథ్యంలో, ఎలాంటి చార్జీలు లేకుండా సేవలందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ పొదుపుఖాతా పధకాన్ని అందిస్తోంది. 2017లో ప్రారంభించిన 811 పొదుపు ఖాతా పథకం వల్ల గత 15 నెలల వ్యవధిలో 65 లక్షల మంది తమ […]


 • నా కలల్ని నెరవేర్చుకోవాలనే…

  ‘‘పారితోషికం కంటే నటన గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటా’’ అంటోంది కీర్తిసురేష్‌. ఇప్పటికే బంగారం లాంటి భామ అనిపించుకొందామె. ‘మహానటి’తో ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన కీర్తి, ప్రస్తుతం తమిళంలో పక్కా మాస్‌ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ‘పందెం కోడి 2’ ఒకటి. ఆ చిత్రం కోసం తనతో కలిసి పనిచేసిన చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ ఒకొక్క బంగారు నాణేన్ని అందజేసి తన పెద్ద మనసుని చాటుకొంది. ఆమెకి ఈ అలవాటు మొదట్నుంచీ ఉందట. ఇదివరకు వెండినాణేలు ఇచ్చేవారట. ‘మహానటి’ […]


 • కాకి సందేశం

  చాలా మంది ఆహార పదార్థాలు తినేసి వాటి కాగితాలను, చెత్తను రోడ్ల మీదే పడేస్తుంటారు. దీని వల్ల మన పరిసరాలను మనమే చేతులారా పాడుచేసుకుంటున్నాం. కానీ, ఇక్కడ మాత్రం కాకులు చెత్తను ఏరేస్తున్నాయి. మనుషులు చెత్తవేసి పర్యావరణాన్ని పాడుచేస్తుంటే.. అవి మాత్రం శుభ్రం చేస్తున్నాయి. చెత్తను నోటకరుచుకుని తీసుకెళ్లి చక్కగా డస్ట్‌బిన్‌లో పడేస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అవి చేసే పని చూస్తే మాత్రం ముచ్చటేస్తుంది. ఫ్రాన్స్‌లోని పై డూ ఫ్యూ అనే థీమ్‌ పార్క్‌లో చెత్తను […]


 • తెలుగింటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది!

  రాశీ ఖన్నా అంటే అందమే కాదు.. చక్కటి అభినయం కూడా! ఆ విషయాన్ని ఆమె ‘ఊహలు గుసగుసలాడే’తోనే చాటి చెప్పింది. ఆ తర్వాత ఆ స్థాయిలో సత్తా చాటే అవకాశం ‘తొలిప్రేమ’తో ఆమెకు దక్కింది. ప్రస్తుతం నితిన్‌తో ‘శ్రీనివాసకళ్యాణం’లో నటించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా సోమవారం హైదరా బాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ… సినిమాలో మిమ్మల్ని మీరు చూసుకొన్నాక ఏమనిపించింది? కథ వినేటప్పుడే ఓ మంచి సినిమా […]


 • స్కూటర్ కు రూ.63 వేల జరిమానా.. తెలివిగా స్పందించిన యజమాని!

  రాచనగరి ప్రాంతంలో పోలీసుల తనిఖీలు ఓ స్కూటర్ కు రూ.63,500 చలానా నగదుకు బదులు బండినే ఇచ్చేసిన యజమాని సాధారణంగా మన బైక్ లేదా స్కూటర్ పై ఫైన్ పడగానే కంగారు పడిపోతాం. చలానాలు నిర్ణీత మొత్తం దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారేమోనని భయపడతాం. కానీ, మైసూర్ లోని రాచనగరి ప్రాంతంలో ఇందుకు భిన్నమైన, ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. రాచనగరి ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కేఏ09హెచ్ డీ […]


 • శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం

  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు. హరీష్ రావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మిషన్ భగీరధ వైస్ చైర్మన్, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ, ఆర్మూర్, బోదన్, కోరుట్ల శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఎ. జీవన్ రెడ్డి, షకీల్ ఆమిర్, విద్యాసాగర్ రావు, జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ చార్జి డా. […]


 • జగన్ పాదయాత్రకు నిరసనల సెగ.. అడ్డుకున్న కాపులు!

  కాపు రిజర్వేషన్ల పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ నల్ల జెండాలు, ప్లకార్డులతో నిరసన స్పందించని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రకు తూర్పు గోదావరి జిల్లాలో నిరసనల సెగ తగిలింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిని నిరసిస్తూ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో కాపు యువకులు ఈ రోజు జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. ప్లకార్డులు, నల్లజెండాలు ప్రదర్శిస్తూ ‘జై కాపు.. జైజై కాపు’ అంటూ నినాదాలు చేశారు. […]


 • భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటా: కపిల్ దేవ్

  ఆహ్వానం వచ్చిందో, లేదో ఇంకా తెలియదు ఇన్విటేషన్ వస్తే కచ్చితంగా వెళ్తా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటా పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తెలిపారు. అయితే తనకు ఇమ్రాన్ నుంచి ఆహ్వానం అందిందో, లేదో ఇంకా తెలియదని… ఒకవేళ ఆహ్వానం వస్తే కచ్చితంగా వెళ్తానని, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూస్తానని చెప్పారు. అయితే భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం […]


 • అధిక ధరలపై అడ్డంగా బుక్కయిన ఐనాక్స్… సాధారణ ప్రేక్షకులుగా వెళ్లి కేసు నమోదు!

  ఎంఆర్పీ నిబంధనలను పాటించని మాల్స్ టీవీ చానల్స్ కథనాలతో కదిలిన అధికారులు పలు మాల్స్ పై దాడులు గరిష్ఠ చిల్లర ధరలకు మించి సినిమాహాల్స్, మల్టీ ప్లెక్సుల్లో అమ్మకాలు సాగించేందుకు వీల్లేదని తెలంగాణ సర్కారు ఆదేశించినా వినని థియేటర్లపై చర్యలు ప్రారంభం అయ్యాయి. నిన్నటి నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాగా, ఏ మల్టీప్లెక్స్ యాజమాన్యం కూడా వాటిని పట్టించుకో లేదని ఆరోపణలు వచ్చిన వేళ, ఈ ఉదయం లీగల్ మెట్రాలజీ అధికారులు, సాధారణ సినీ ప్రేక్షకుల […]