Articles Posted in the " Local News " Category

 • ఇక టీడీపీ జాతీయ ఆశలు గల్లంతు… తెలంగాణలో పడిపోయిన ఓటింగ్

  జాతీయ పార్టీగా అవతరించాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఇటీవలి తెలంగాణ ఎన్నికలు భారీ షాక్ నే ఇచ్చాయి. 13 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 2 స్థానాలు మాత్రమే విజయం సాధించింది. ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, సత్తుపల్లి మినహా ఎక్కడా టీడీపీ గెలవలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయడు ప్రచారం చేసిన స్థానాల్లోనూ టీడీపీ ఓటమి పాలయ్యింది. […]


 • ఏపీలోనూ..ముందస్తు అభ్యర్థుల ఖరారు

  తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్.. ఊహించని రీతిలో ముందస్తు ఎన్నికలకు తరలేపి విజయకేతనం ఎగురవేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. తనకు సాటిలేదని నిరూపించారు. అయితే ఏపీ లో చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే. ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి పనుల పట్ల ఆనందంగా ఉన్నారు ఏపీ ప్రజలు. దీంతో బాబు కూడా కేసీఆర్ వలె ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో బాబు మాట్లాడిన తీరు […]


 • తెలంగాణలో పెధాయ్ ప్రభావం

  పెథాయ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను వణికించింది. ఈదురుగాలులకు ప్రజలు అల్లాడిపోయారు. ఏపీని వణికించిన చలిగాలులు తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రభావం చూపాయి. హైదరాబాద్‌లోనూ బలమైన చలిగాలులు వీచాయి. దీంతో ప్రజలు ఆరుబయటకు రావడానికే భయపడ్డారు. రాకాసి తుఫాన్ పెథాయ్ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్లలో, కల్లాలలో ఉంచిన ధాన్యం తడిసిముద్దైంది. దీంతో రైతులు కంటతడి పెట్టారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో […]


 • అమరావతి ప్రాంతంలో 19న ఆరు ఐటీ కంపెనీలు ప్రారంభం

  నవ్యాంధ్రలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది. ఐటీ కంపెనీలతో పాటు… వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు… ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో ఐటీ సంస్థల సందడి మరింత పెరగనుంది. ఈ క్రమంలో, అమరావతిలో మరో ఆరు ఐటీ స్టార్టప్ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఎపీఎన్‌ఆర్‌టీ) ఆధ్వర్యంలో ఐదు సంస్థలను అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రుల […]


 • బయ్యారం గనుల అంశం మళ్ళీ తెరపైకి

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృత ప్రచారంలోకి వచ్చిన బయ్యారం గనుల అంశం మళ్ళీ తెరపైకి వస్తోంది. తెలంగాణ ఆవిర్భవం తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కేంద్రం చొరవ తీసుకోవాలని పలుమార్లు డిమాండ్ చేశారు. బయ్యారం ఇనుప ఖనిజం గనుల అంశంపై కేంద్రంతో చర్చిస్తామని ప్రకటించారు. బయ్యారం వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే ప్రత్యక్ష, పరోక్షంగా 20వేల మంది యువకులకు ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం […]


 • కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాన్

  సోమవారం ఉదయం తూర్పుగోదారి, పచ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుననయి. తూర్పు గోదావరి, పచ్చిమ గోదావరి జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు గంటకు 110 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది. అరటి రైతులు, ఉద్యానవన రైతులు జాగ్రత్తల్లో […]


 • ఇక టీఆర్‌ఎస్‌ పంచాయితీలపై గురి

  బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం విద్యావంతులైన నిరుద్యోగులు ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 12 లక్షల మంది రుణాల కోసం బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే గత నాలుగున్నర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయాం టలో కేవలం 1.13లక్షల మందికి మాత్రమే రుణాలు అందజేశారు. మిగతా వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం తప్పా ఎవరికీ రుణాలు ఇవ్వలేదు. కనీసం ఈ కొత్త ప్రభుత్వంలోనైనా అర్హులైన బీసీలందరికీ రుణాలు అందజేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. […]


 • కడపలో 3వేల ఎకరాల్లో స్టీల్ ప్లాంట్

  రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కార్యరూపం దాల్చబోతోంది. కడప ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయి, కేంద్రాన్ని కదిలించేందుకు నిరాహార దీక్షలు చేసి పోరాడినా ఫలితం లేక చివరికి ముఖ్యమంత్రే మూడు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం ముందుంచారు. అయినా కేంద్రం స్పందించలేదు. అలాగని ప్రజల ప్రయోజనాలను, మనోభావాలను పక్కన పెట్టలేక… క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో సైతం కడప జిల్లాలో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలనుకున్నారు చంద్రబాబు.మైలవరం మండలంలోని ఎం.కంబలదిన్నె […]


 • అమలాపురంలో టీడీపీ వైరి వర్గాలు

  పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి జరిగిన జెంటిల్మన్‌ ఒప్పందం అమలు పట్టణ టీడీపీకి తలకు మించిన భారమైంది. ఆ ఒప్పందం అమలుకు వెసులుబాటు కల్పిస్తూ అప్పటి దాకా పదవుల్లో ఉన్న చైర్మన్, వైస్‌ చైర్మన్లు రాజీనామాలు చేయడం.. ఈనెల 11న కొత్త చైర్మన్‌ అభ్యర్థి, నాలుగో వార్డు కౌన్సిలర్‌ యాళ్ల నాగ సతీష్‌ చైర్మన్‌ పీఠం ఎక్కేందుకు ఎన్నికల సంఘం తేదీ ప్రకటించడంతో అక్కడితో కథ సుఖాంతమైందని అందరూ అనుకున్నారు. అయితే వైస్‌ చైర్‌పర్సన్‌ ఎంపిక పట్టణ […]


 • టీఆర్ఎస్ లో గెలిచిన 119 మందిలో 67 మంది నేరచరితులే!

  టీఆర్ఎస్ లో సగం మంది నేరచరితులే కూటమి నుంచి గెలిచిన 21 మందిలో 16 మందిపై కేసులు వెల్లడించిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నూతనంగా 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పటికీ, వీరిలో అత్యధికులు గత శాసనసభలో ఉన్నవారే. నూతనంగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల్లో వివిధ పార్టీలకు చెందిన 67 మంది నేరచరితులేనని ఫోరమ్ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ వెల్లడించింది. వీరందరిపై సివిల్, క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ లో […]